The Lord of The Rings – The Fellowship of The Ring

మొత్తానికి చదవడం పూర్తీ అయ్యింది. అబ్బో, చాలా టైం తీసుకుంది ఈ పుస్తకం. ఈ ‘ఫెలోషిప్ ఆఫ్ రింగ్’, రెండు పుస్తకాలు. మొదటిదానిలో, హాబిట్స్ గురించి, వారు పుట్టు పూర్వోత్తరాల గురించి, వారి వంశికుల గురించి, వారిలో ఉండే ప్రముఖుల గురించి, డిటేయిల్డుగా చెప్పడముతో పుస్తకం మొదలవుతుంది. గండాల్ఫ్ షైర్ కి రావడం, బిల్బో బ్యాగిన్స్ పుట్టినరోజు, ఫెయిర్ వర్క్సుతో మొదలై, ఫ్రొదో అండ్ కంపెనీ, రివెండెల్ కు చేరుకోవడముతో ముగుస్తుంది. రెండవ పుస్తకం, రివెండెల్ లో, ఎల్ రాండ్ కౌన్సెల్ తో మొదలవుతుంది, చివరకి, ఫ్రొదో, శ్యాం ఇద్దరు మిగిలిన వారిని వదిలేసి, బోటులో మోర్డార్ కు బయలుదేరడముతో ముగుస్తుంది.

సినిమాకు, నవలకు చాలా డిఫరెన్సులు ఉన్నాయి. అసలు బిల్బో బ్యాగిన్స్ పుట్టిన రోజు ఫ్రొడో 33 ఏటా జరుగుతుంది. తరువాత బిల్బో షైర్ వదిలేసి వెళ్లిపోవడం, గండాల్ఫ్ ఫ్రొడోతో రింగ్ గురించి చెప్పడం ఇదంతా జరుగుతుంది.. కానీ, ఫ్రోడో షైర్ వదిలి వెళ్లడం మాత్రం అతని 50వ పుట్టిన రోజు తరువాత జరుగుతుంది. అంటే 17ఏళ్ళ పాటు ఆ రింగ్ ఫ్రోడో దగ్గరే సేఫుగా ఉంటుంది. ఫ్రోడో దాన్ని అస్సలు ఉపయోగించడు.

సినిమాలో ఫ్రోడో , శ్యాం ఇద్దరు బయలుదేరితే, దారిలో మెర్రీ అండ్ పిప్పిన్ కలుస్తారు. ఒక పొలములో దొంగతనం చేస్తూ. కానీ, నవలలో, ఫ్రోడో, శ్యాం, పిప్పిన్ ముగ్గురు కలిసే వెళతారు. మొదట ప్లాన్ ప్రకారం వారు క్రీక్ ఉడ్ కి వెళ్లి, దాని తరువాత, సైలెంటుగా మోర్డార్ కి వెళ్ళాలి. షైర్ లోఉండే జనాలకు అనుమానం రాకుండా ఉండడం కోసం ఈ ప్లాన్ వేస్తారు. క్రీక్ ఉడ్ వద్ద వారికీ మెర్రీ జతకలుస్తాడు. నిజానికి పిప్పిన్, మెర్రీకి ఆ రింగ్ గురించి ముందే తెలుసు. బిల్బో బ్యాగీన్సును గమనిస్తూ ఉంటారు వారు. శ్యాం వాళ్ళ నమ్మకమైన గూఢచారి, వారికీ ఎప్పటికప్పుడు వార్తలు చేరవేస్తూ ఉంటాడు.

వీరు క్రీక్ ఉడ్ నుండి, నఙ్గుల్స్ దాడిని తప్పించుకోవడానికి ఓల్డ్ ఫారెస్ట్ గుండా వెళతారు. అక్కడ ఓల్డ్ ఫారెస్టులో, వీరిని “వీళ్లో ట్రీ ” కబలించబోతే “టామ్ బొంబాడిల్” వారిని కాపాడతాడు. అక్కడనుండి, కాసేపు “టామ్ బొంబాడిల్” గురించి, అతని భార్య “గోల్డ్ బెర్రీ” గురించి ఉంటుంది. గోల్డ్ బెర్రీ, అందగత్తెల్లో కెల్లా అందగత్తె. పకృతి దేవత అన్నట్టుగా వర్ణించేసాడు రచయిత.

తరువాత, కంపనీ బ్రీ చేరడం, అక్కడ మన హీరో “ఆరగాన్” కలవడం, తరువాత మల్లి జర్నీ … రివన్డేల్ కు వెళ్ళేవరకు. మధ్యలో ఒక సారి నఙ్గుల్స్ వీరిని అటాక్ చేయడం ఫ్రోడో ను గాయపరచడం జరుగుతుంది.

సినిమాలో అయితే, ఆరగాన్ ప్రేయసి, ఎల్ఫ్ ప్రిన్సెస్, అర్వెన్ వచ్చి ఫ్రొడో ని రివన్డేల్ కు తీసుకు వెళుతుంది. కానీ, నవలలో మాత్రం .. ఈ కంపెనీయే వెళుతుంది. దాదాపుగా రివెండెల్ దగ్గరకు వెళ్లిన తరువాత.. ఎల్ రాండ్ పంపిన ఎల్ఫ్ ఒకతను వీరిని కలుస్తాడు.. అక్కడ బ్రిడ్జి దాటే సమయములో నఙ్గుల్స్ మళ్ళీ దాడి చేస్తే, ఫ్రొడో తనంతట తనే నదిని దాటి రివెండెల్ కు వెళ్తాడు. అక్కడ నదిలో వరద వచ్చి నఙ్గుల్స్ ని ప్రవాహములో తీసుకెళ్లి పోతుంది. ఇదంతా ఎల్ రాండ్ చేసే సహాయం. ” ఆర్వెన్ ” కు ఇందులో ఎలాంటి సంబంధం ఉండదు. అసలు మొత్తం నవలలో ఆమె గురించి మహా అయితే రెండు మూడు లైన్లుంటాయి ఒకట్రెండు పెరాలలో అంతే !

ఆ తరువాత, వీల్లను 9మంది కంపానియన్లుగా (గాండాల్ఫ్, ఫ్రోడో, అరగాన్, లెగోలస్, బారోమిర్, గింలీ, శ్యాం, మెర్రి, పిప్పిన్, ) ఎల్ రాండ్ ఎన్నుకోవడం, నజ్గుల్స్ తొమ్మిది మంది ఉంటాౠ, వారికి తగినట్టు తొమ్మింది మంది కంపానియన్లన్న మాట, వారు రివండేల్ నుండి జర్నీ మొదలు పెట్టి, కరద్రాస్ ( పర్వతాలు ) దాటడానికి ట్రై చేయడం, కుదరక మోరియా మైన్స్ గుండా వెళ్లడం ..

మోరియా మైన్స్ ఎపిసోడ్ చాలా బావుంటుంది. సినిమాలో చుసిన దానికన్నా, డిటైల్డుగా వివరించాడు రచయిత. .. మోరియా మైన్స్ లో డ్వార్ఫ్స్ ఎంత అందంగా నగరాలు నిర్మించారో, ఎంత చక్కగా వాటిని డెకరేట్ చేసారో … కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తాడు. బ్రిడ్జ్ ఆఫ్ కాజాద్ డూం వద్ద, గండాల్ఫ్ .. బెల్రగ్ తో పోరాటం, దాని గురించి వర్ణనలు బావుంటాయి. గండాల్ఫ్ చనిపోయిన తరువాత, కాస్త చప్పగా కాస్త చప్పగా సాగుతుంది.. లోరియన్ అని, లేడి గళాద్రియేల్ ల్యాండ్ ను పరిచయం చేసే వరకు అలానే ఉంటుంది. ఆ తరువాత మల్లి ఇంట్రెస్టింగుగా మారుతుంది.

గళాద్రియెల్, అద్దములో ఫ్రొడోకి, శ్యాం కి జరగబోయేది చుపించడం, అది సినిమాకు నవలకు చాలా వ్యత్యాసం ఉంది. సినిమాలో, వీళ్ళంతా విడిపోవడం చుపిస్తారు. కానీ, ఇందులో ఎక్కువగా షైర్ గురించి ఉంటుంది. అలానే లేడి గళాద్రియెల్ అందరికి గిఫ్టులు ఇవ్వడములో కూడా ! శ్యాం కు ఆమె ఒక బాక్సు నిండా మట్టి ఇస్తుంది, సినిమాలో చుపించినట్టు రోప్ కాదు. ఆ మట్టిని అతను చల్లిన చోట.. గార్డెన్.. ఆ ఏరియాలోకల్లా అందంగా ఉంటుంది అని చెబుతుంది..

తరువాత వీళ్లు ఎమిన్ మెయిల్ చేరుకునే వరకు సాధారణంగానే సాగుతుంది కథంతా. అక్కడ, ఫెలోషిప్ బ్రేక్ చేయడమా, లేక కలిసి వెళ్లడమా అన్న చర్చ జరుగుతుంది. బారోమీర్ తో కలిసి “మినాస్ టిరిత్” కు వెళ్ళడానికి కాసేపు మొగ్గు సుపుతారు. కానీ, ఎటు తేలక, రింగ్ బేరర్, ఫ్రొడో కె ఎటు వెళ్ళాలి అన్నదాన్ని వదిలేస్తారు. ఫ్రొదో తనకు ఆలోచించుకోవడానికి ఒక గంట టైము కావాలని ఒంటరిగా తిరిగేప్పుడు బారోమీర్, ఫ్రొడో దగ్గరనుండి రింగ్ తీసుకోవడానికి ట్రై చేయడములో, ఆటను రింగ్ వెలికి తొడుక్కుని మాయమై పోతాడు. వాళ్ళందరిని వదిలే తాను ఒక్కడే మొర్దార్ కి వెళ్లాలని నిర్ణయించుకుని వెళ్ళిపోతాడు. ఫ్రొదో ఇంతకీ రాక పోవడముతో, అతని కోసం సెర్చ్ మొదలవుతుంది. శ్యాం ఒక్కడే కరెక్టుగా గెస్ చేసి, బోట్ల వద్దకు వెళ్తాడు. ఫ్రొడో వద్దన్నా వినకుండా .. అతన్ని ఫాలో అవుతాడు. ఫైనలుగా వాళ్లిద్దరూ మిగిలినన వారిని వదిలి బోటులో వెల్లడముతో పుస్తకం ముగుస్తుంది. సినిమాలో దీన్ని డిఫరెంటుగా చూపిస్తారు.

సినిమాలో చుపించినట్టు, బారోమీర్ “ఫెలోషిప్ ఆఫ్ డా రింగ్” నవలలో చనిపోడు. “టు టవర్స్” భాగము మొదలులో చనిపోతాడట.

పుస్తకములో “రాడగస్టు ద బ్రౌన్” గురించి కొంత ఉంటుంది. సినిమాలో అయితే అతన్ని కేవలం, హాబీటి త్రయాలజీలో మాత్రమే చూపిస్తారు. పుస్తకములో మాత్రం, హాబిట్ నవలలో అతని గురించి ఒక్క సారి మెన్షన్ చేస్తారు అంతే. కథలో అతని ఇన్వాల్వ్ మెంటు “ఫెలోషిప్ ఆఫ్ రింగ్”లోనే ఉంది.

ఇందులో ఫార్మర్ మ్యాగ్గాట్ గురించి ఉంటుంది. ఫ్రోడోని బిల్బో బ్యాగిన్స్ దత్తత చేసుకోక మునుపు, ఫ్రోడో ఇతని పొలములో మష్రూంస్ దొంగ తనం చేస్తూ పట్టుబడడం, దెబ్బలు తినడం జరుగుతుంది. తరువాత, ఈ జర్నీలో భాగంగా వారు ఇతన్ని కలవడం, అతను చక్కని ఆతిద్యాన్ని ఇవ్వడం జరుగుతుంది.

ఒక చోట, ఆరగాన్ “లూథియేన్” అనే లెంజెండరి ఎల్ఫ్ ప్రిన్స్ గురించి సెప్పే పద్యం ఒకటి ఉంటుంది. మొత్తం ఆమె స్టోరీ అంతా ఆ పద్యములోనే చెబుతాడు. ఇంకోసారి గింలీ , డ్వార్ఫ్ పట్టణం గురించి, డ్యూరిన్ గురించి పద్యం సెబుతాడు, మోరియా మైన్స్ దాటి వసిసిన తరువాత. ఇవి రెండు చాలా బావుంటాయి. నేను బాగా ఫీలయిన కవితలు ఈ రెండు.

ఈ నవల మొత్తం, గొల్లం గురించిన ప్రస్తావన ఉంటుంది. గొల్లం వీరిని సీక్రేటుగా ఫాలో అవుతూ ఉంటాడు. ఫ్రొడో , గండాల్ఫ్, ఆరగాన్ అతని ఉనికిని పసిగడతారు కూడా. మోరియాలో కూడా అతను వీరిని ఫాలో అవుతాడు. చివరికి లోరియన్ ప్రాంతములో, అండ్యూయీన్ నదిలో చాలా వరకు అనుసరిస్తారు. తరువాత అతని జాడ ఉండదు.

మొత్తానికి ఈ పుస్తకములో మనం కథ కన్నా ఎక్కువగా.. పరిసరాలను రచయిత ఎంత డిటెయిల్డుగ వివరిస్తాడో చూడొచ్చూ. ప్రతి ప్రాంతాన్ని, ప్రతి ప్రయాణాన్ని కళ్ళకు కట్టినట్టు వివరించడమే ఇందులో ఎక్కువ. గట్టిగా మాట్లాడితే, మిడిల్ ఎర్త్ ను మనకు పరిచయం చేస్తూ, ఆ పరిసరాలను వర్ణిస్తూ .. కథలోకి మనల్ని తీసుకెళ్తాడు రచయిత.

ఒక క్లాసిక్ చదవాలి అన్న ఫీలింగ్ ఉంది, మీరు “లార్డ్ ఆఫ్ ద రింగు” కు అభిమాని అయ్యుంటే తప్పక చదవాల్సిన పుస్తకమే ఇది. కాకపొతే కాస్త ఓపిగ్గా చదవాలి, ఎంజాయ్ చేయాలి అంటే.



Leave a comment

Design a site like this with WordPress.com
Get started